News March 5, 2025
కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.
Similar News
News March 19, 2025
విశాఖలో కానరాని చలివేంద్రాలు..!

విశాఖనగరంలో ఎండలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే ఎక్కడ వడదెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. మనిషి నిరసించి పడిపోతే వెంటనే నీరు అవసరం. గతంలో జీవీఎంసీ సహా పలు స్వచ్ఛందసంస్థలు ప్రతివార్డులో చలివేంద్రాల్లో మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసేవి. ఇప్పుడు ఆరిలోవ నుంచి మద్దిలపాలెం వరకు ఎక్కడ చుసిన ఒక్క చలివేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.
News March 19, 2025
కొల్లిపర: పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కొల్లిపరలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్న తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొల్లిపర పాఠశాలను సెన్సిటివ్ జాబితాలో ఎందుకు చేర్చారని అధికారులను ప్రశ్నించారు.
News March 19, 2025
టీచర్ల బదిలీల చట్టంతో చరిత్ర సృష్టించబోతున్నాం: లోకేశ్

AP: ఏపీ ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ‘YCP ప్రభుత్వంలో అడ్డగోలుగా బదిలీలు జరిగాయి. అందరితో చర్చించాకే టీచర్ల బదిలీల చట్టం తీసుకొచ్చాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఉంటుంది. టీచర్ల బదిలీల చట్టం ద్వారా మా ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోంది’ అని లోకేశ్ అన్నారు.