News April 2, 2025
కర్నూలు- విజయవాడ విమాన సర్వీసులపై చర్చించిన మంత్రి టీజీ

కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కర్నూలు – విజయవాడ విమాన సౌకర్యంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని టి.జి భరత్ పేర్కొన్నారు.
Similar News
News April 10, 2025
కర్నూలుతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా హౌసింగ్, పిజిఆర్ఎస్, పీఆర్ వన్ యాప్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాగునీరు, రీసర్వే, ఐవిఆర్ఎస్ వంటి అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు పరిశీలించి, అధికారులకు నిబంధనలు, ఆదేశాలు జారీ చేశారు.
News April 9, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.!

➤ ఓటర్ల సమస్య పరిష్కరిస్తాం: కలెక్టర్
➤ కర్నూలు: ముగిసిన 10th పేపర్ వాల్యూయేషన్
➤ మంత్రాలయం: రేషన్ షాపుల్లో రసీదులు తీసుకోవాలి
➤ జగన్ను తక్షణమే అరెస్ట్ చేయాలి: సోమిశెట్టి
➤ఆదోనిలో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
➤మంత్రాలయంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆగ్రహం
➤ఆదోని: ‘అసాంఘిక కార్యకలాపాల నివారణ మా లక్ష్యం’
➤జిల్లా వ్యాప్తంగా వినతులు స్వీకరించిన టీడీపీ నాయకులు
News April 9, 2025
కర్నూలు: ముగిసిన 10th పేపర్ వాల్యూయేషన్

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం బుధవారం నాటికి పూర్తయిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లాకు వచ్చిన 192725 పేపర్లు 7 రోజులపాటు మూల్యాంకనం నిర్వహించామని డీఈఓ వివరించారు. ఓపెన్ ఇంటర్మీడియట్ మూల్యాంకనం ఆరు రోజులలో 100% పూర్తయిందన్నారు. మూల్యాంకనానికి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.