News April 3, 2025

క‌ర్నూలు-విజ‌య‌వాడ విమాన స‌ర్వీసులపై చ‌ర్చ

image

క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరిన‌ట్లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి టీజీ భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి ఈ మేరకు చ‌ర్చించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పార‌ని భరత్ తెలిపారు.

Similar News

News December 15, 2025

కర్నూలు: అంగన్వాడీలకు ఫోన్లు ఇచ్చిన కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ 5-జీ సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

News December 15, 2025

కర్నూలు జిల్లాలో బదిలీ అయిన ఎస్ఐలు వీరే!

image

కర్నూలు రేంజ్‌లో 15 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఏపీ శ్రీనివాసులు కర్నూల్ 4 టౌన్ నుంచి 3 టౌన్‌కు, హనుమంత్ రెడ్డి గూడూరు పీఎస్ నుంచి సీసీఎస్ కర్నూల్‌కు, శరత్ కుమార్ నాగలాపురం నుంచి కర్నూలు 4 టౌన్‌కు, ఎల్.శివాంజల్ మంత్రాలయం నుంచి సీసీఎస్‌కు, ఈ.మూర్తి హల్లహర్వి నుంచి DSB కర్నూల్‌కు, విజయ్ కుమార్ నాయక్ మద్దికేర నుంచి పత్తికొండ యూపీఎస్‌కు బదిలీ అయ్యారు.

News December 15, 2025

పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి గుర్తింపు: కలెక్టర్ సిరి

image

తన ప్రాణత్యాగంతో తెలుగు జాతికి గుర్తింపునిచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో పాటు జిల్లా అధికారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు.