News February 25, 2025
కర్నూలు: వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు

జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలను పట్టించుకోని ఎలక్ట్రిక్ బైక్ MDకి కమిషన్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి బైక్ కొనుగోలు చేయగా మరమ్మతులకు గురవుతుండటంతో కమిషన్ను సంప్రదించారు. విచారణ చేసి బైక్ కొనుగోలు మొత్తాన్ని 9% వడ్డీతో చెల్లించి, మరో రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని గతంలో కమిషన్ తీర్పునిచ్చింది. MD ఆ ఆదేశాలు పట్టించుకోలేదు.
Similar News
News September 17, 2025
స్త్రీల ఆరోగ్యమే కుటుంబ బలానికి ఆధారం: నవ్య

కర్నూలు పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, పోషణ్ మాహ్ కార్యక్రమాల్లో బుధవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.బి.నవ్య పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం పరిరక్షణతో కుటుంబ బలోపేతం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. సమతుల్య ఆహారం, యోగా, స్క్రీనింగ్ టెస్టులపై అవగాహన కల్పించారు. గర్భిణులకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాశనం చేశారు.
News September 16, 2025
కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.
News September 15, 2025
పూర్వ విద్యార్థుల సాయం హర్షణీయం: MP

KNL: పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. నగరంలోని రాక్ వుడ్ మెమోరియల్ పాఠశాలలో 1976-1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. ఎంపీ పాల్గొని ఆరోజులను గుర్తు చేసుకున్నారు. రాక్ వుడ్ పాఠశాలను తిరిగి స్కూల్, లేదా స్టడీ సర్కిల్గా ఏర్పాటు చేసేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారని, తన వంతు సాయం చేస్తానని చెప్పారు.