News April 4, 2025
కర్నూలు: ‘విమానాశ్రయానికి వసతులు కల్పించాలి’

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 13, 2025
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కర్నూలులో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం రద్దు చేయబడినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ప్రజలు వారి సమస్యలను తెలియజేసేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. జిల్లాలో ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News April 12, 2025
నంద్యాల: ఇంటర్ ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్య.!

ఇంటర్ ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బండి ఆత్మకూరుకి చెందిన మస్తాన్ అనే విద్యార్థి నంద్యాల గవర్నమెంట్ కాలేజీలో చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపం చెంది <<16067190>>ఉరి వేసుకొని ఆత్మహత్య<<>> చేసుకున్నాడు. తండ్రి పెద్ద మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.
News April 12, 2025
కర్నూలు: రాష్ట్ర స్థాయిలో KGBV విద్యార్థినుల సత్తా

AP ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన సీనియర్ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కర్నూలు జిల్లా పంచలింగాల KGBVకి చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ స్వప్న కుమారి తెలిపారు. మొదటి ర్యాంకులో టీ.మానస 992/1000, 2వ ర్యాంకులో యు. మానస 992/1000, 3వ ర్యాంకులో టీ. సుజాత 981/1000 మార్కులతో నిలిచారు.