News September 19, 2024

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా జయలక్ష్మి

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా ఆర్.జయలక్ష్మిని నియమిస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జయలక్ష్మి అనంతపురం మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత కార్యదర్శి గోవిందును అనంతపురం బదిలీ చేశారు.

Similar News

News October 5, 2024

జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారుడు

image

ఈనెల 6 నుంచి 13 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కర్నూలు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు వీరేశ్ ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి షేక్షావల్లి తెలిపారు. శనివారం కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో వీరేశ్‌ను సత్కరించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, న్యాయవాది శ్రీధర్ రెడ్డి, కోచ్ యుసుఫ్ బాషా పాల్గొన్నారు.

News October 5, 2024

బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. శనివారం దేవరగట్టును ఆయన సందర్శించి మాట్లాడారు. పండుగను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా జరుపుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు గట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News October 5, 2024

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరు విద్యార్థిని ఎంపిక

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హబ్షిబా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ షేక్షావలి, ఫిజికల్ డైరెక్టర్ రియాజుద్దీన్ శుక్రవారం తెలిపారు. కర్నూలు స్టేడియంలో సెప్టెంబర్ 26న జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ పోటీలలో హబ్షిబా ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.