News July 27, 2024
కర్నూలు సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ శాఖ డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు. ప్రవీణ్‌కుమార్ ఆ స్థలాన్ని మొత్తం 15 దస్తావేజులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ డీఐజీ చర్యలు తీసుకున్నారు.
Similar News
News October 11, 2024
హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ వైజాగ్
చాగలమర్రి జడ్పీ హైస్కూల్లో 53వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్‌ను వైజాగ్ జట్టు కైవశం చేసుకుంది. కర్నూలు జట్టుకు కాంస్య పతకం దక్కింది. వైజాగ్ జట్టుకు మొదటి స్థానం, తూ.గో జట్టుకు రెండో స్థానం, కర్నూలు జట్టుకు మూడో స్థానం లభించింది. కాంస్య పతకం సాధించిన కర్నూలు జట్టును రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు అభినందించారు.
News October 11, 2024
ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
ఇంటి నిర్మాణాల్లో దిగువ స్థానంలో ఉన్నామని, ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 23శాతం మాత్రమే ప్రగతి సాధించారన్నారు.
News October 11, 2024
నంద్యాల వైద్యుడిని బెదిరించి ₹38 లక్షలు కాజేశారు!
తాము CBI ఆఫీసర్లమంటూ సైబర నేరగాళ్లు నంద్యాల వైద్యుడిని మోసం చేశారు. పద్మావతినగర్‌లోని రాహుల్ ఆసుపత్రి అధినేత డా.రామయ్యకు సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీపై కేసులున్నాయి.. అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఆందోళనకు గురైన వైద్యుడు ₹38 లక్షలకు వారి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత మేల్కొన్న వైద్యుడు మోసగాళ్లని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.