News June 12, 2024
కర్నూలు: సీనియర్లకు దక్కని మంత్రి పదవి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రి పదవి ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురైంది. జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. సీనియర్ నాయకులు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, బీవీ జయనాగేశ్వర రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావించారు. అయితే సీనియర్ నేతలు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, యువ నేత టీజీ భరత్‌కు మాత్రమే దక్కింది. ఇటు కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన పార్థసారథికి కూడా దక్కలేదు.
Similar News
News March 25, 2025
బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు SP

ఐపీఎల్ వేళ యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని కర్నూలు SP విక్రాంత్ పాటిల్ సూచించారు. ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమనే మాయలో పడకండి. అమాయక ప్రజలను మోసగించేందుకు ముఠాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌తో కొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే 100/112కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని ఎస్పీ తెలిపారు.
News March 25, 2025
ప్యాపిలి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన ఐఐటీ స్టూడెంట్ అరుణ్ కుమార్ పంజాబ్‌లో ఈ నెల 15న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోలుకోలేక నిన్న మృతి చెందాడు. సోమవారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. పంజాబ్‌లో ఐఐటీ చదువుతున్న అరుణ్ క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది.
News March 25, 2025
జియో మైసూర్ కంపెనీ గోల్డ్ మెన్స్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ సర్వే

తుగ్గలి మండలం జొన్నగిరి పరిసర ప్రాంతాలలో జియో మైసూర్ కంపెనీ నిర్వహిస్తున్న గోల్డ్ మైన్స్‌ను సౌత్ ఆఫ్రికా మైనింగ్ నిపుణులు సోమవారం సర్వే చేసినట్లు పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి క్రాంతి నాయుడు తెలిపారు. సీఎస్‌ఆర్ పనులు, పర్యావరణ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, ల్యాండ్ లీజ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి మైనింగ్ నిపుణులు చర్చించారని ఆయన తెలిపారు.