News November 29, 2024
కర్నూలు: ‘సెమిస్టర్ పరీక్షలను పక్కగా నిర్వహించాలి’

పరీక్షలను సరిగ్గా నిర్వహించాలని ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ అన్నారు. శుక్రవారం రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. 6,531 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 5,848 మంది హాజరయ్యారు. 683 గైర్హాజరయ్యారు.
Similar News
News January 25, 2026
అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలైన ఏడుగురికి పీవోఏ యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
News January 25, 2026
రేపు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు: కలెక్టర్

ఈనెల 26న (సోమవారం) కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఆ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.
News January 25, 2026
కర్నూలు: ‘శ్మశాన వాటికకు వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే’

తుగ్గలిలోని దళితులకు సరియైన శ్మశాన వాటిక లేక మృతదేహంపై మరొక మృతదేహం పెడుతూ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం మరియమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆమెను అరకొరగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన దారి లేక సుమారు మోకాళ్ల లోతుకుపైగా ఉన్న నీళ్లు ఉన్న బురదలో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపాలని కోరారు.


