News April 5, 2025

కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్

image

కర్నూలు జిల్లా 10th విద్యార్థులకు శుభవార్త. పదో తరగతి పరీక్షలు కంప్లీట్ అయిన విద్యార్థులకు తాండ్రుపాడు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్‌ ప్రవేశానికి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. శిక్షణకు వచ్చే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తామన్నారు. వివరాలకు తాండ్రుపాడు కళాశాలను సంప్రదించాలన్నారు.

Similar News

News April 7, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి!

image

ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

News April 7, 2025

ఎండలతో జాగ్రత్త!

image

కర్నూలు జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా నిన్న జిల్లాలోని కామవరంలో అత్యధికంగా 40.8°C ఉష్ణోగ్రత నమోదైంది.

News April 7, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు➤ నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్➤ ఎమ్మిగనూరు: ప్రమాదంలో ఒకరు మృతి➤శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హై కోర్టు జడ్జ్ ➤రామ నామాలతో శ్రీరాముడి చిత్రం➤ పారతో చెత్త తొలగించిన ఆదోని ఎమ్మెల్యే➤ శ్రీ మఠంలో మూల బృందావనానికి పూజలు➤ కోడుమూరు: యువకుడిపై పోక్సో కేసు➤ పెద్దకడబూరు: ఎల్ఎల్సీ కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం 

error: Content is protected !!