News February 5, 2025

కర్నూలు: 17 రోజుల్లో పెళ్లి.. వెంటాడిన మృత్యువు

image

మరో 17 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని మృత్యువు కబళించింది. దేవనకొండ(M) పీ.కోటకొండకు చెందిన సురేశ్(21)కు ఈనెల 22, 23న పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో కే.నాగలాపురం సుంకులమ్మకు పూజలు చేసేందుకు మంగళవారం వెళ్లాడు. తిరిగి బైక్‌పై వస్తుండగా పెంచికలపాడు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. సురేశ్‌కు, తన అవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సురేశ్‌ మృతిచెందాడు.

Similar News

News December 9, 2025

ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా: కడప ఎస్పీ

image

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్, రాజకీయ సున్నిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం పులివెందుల సబ్ డివిజన్ అధికారులతో కడపలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జీఎంఎస్‌కేలతో కలిసి గ్రామాల్లో గస్తీ పెంచాలని సూచించారు.

News December 9, 2025

ఉట్నూర్: విద్యార్థులకు ITDA PO మార్గనిర్దేశనం

image

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ఆధ్వర్యంలో కేర్ అకాడమి కేబీ కాంప్లెక్స్‌లో నెల రోజుల అసిస్టెంట్ నర్స్ శిక్షణ పూర్తి చేసుకొని ఆన్ జాబ్ ట్రైనింగ్‌కు ఎంపికైన విద్యార్థులను ITDA PO యువరాజ్ మర్మాట్ అభినందించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీఎం నాగభూషణం, విద్యా అకాడమీ మేనేజర్ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.

News December 9, 2025

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

image

రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులను ఆమె ఆదేశించారు.