News February 5, 2025
కర్నూలు: 17 రోజుల్లో పెళ్లి.. వెంటాడిన మృత్యువు

మరో 17 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని మృత్యువు కబళించింది. దేవనకొండ(M) పీ.కోటకొండకు చెందిన సురేశ్(21)కు ఈనెల 22, 23న పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో కే.నాగలాపురం సుంకులమ్మకు పూజలు చేసేందుకు మంగళవారం వెళ్లాడు. తిరిగి బైక్‌పై వస్తుండగా పెంచికలపాడు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. సురేశ్‌కు, తన అవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సురేశ్ మృతిచెందాడు.
Similar News
News February 14, 2025
నల్గొండ: 20నాటికి లబ్ధిదారుల జాబితా పూర్తికావాలి: కలెక్టర్ త్రిపాఠి

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆధారంగా అన్ని గ్రామాలలో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఉదయాదీత్య భవన్‌లో ఎంపీడీవోలతో నమూనా ఇందిరమ్మ గృహాల నిర్మాణం, గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారీ, తదిత అంశాలపై సమీక్షించారు. ఈనెల 20నాటికి అన్ని గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
News February 14, 2025
ఒడిశా హైకోర్టులో ‘పద్మశ్రీ’ పంచాయితీ!

ఒడిశా హైకోర్టుకి ఓ వింత పంచాయితీ చేరింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న వ్యక్తికి 2023లో సాహిత్య విభాగంలో కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆ పేరు కలిగిన జర్నలిస్టు ఢిల్లీ వెళ్లి పురస్కారం స్వీకరించారు. అయితే, అది తనకు ప్రకటిస్తే వేరే వ్యక్తి తీసుకున్నారని అదే పేరు కలిగిన వైద్యుడు హైకోర్టుకెక్కారు. దీంతో వారిద్దరినీ వారి వారి రుజువులతో తదుపరి విచారణకు కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
News February 14, 2025
రేవంత్‌వి దిగజారుడు మాటలు: కిషన్ రెడ్డి

TG: ప్రధాని మోదీ పుట్టుకతో BC కాదంటూ CM రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలను <<>>కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అటు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ 10 జన్‌పథ్(సోనియా ఇల్లు) నుంచే ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.