News April 9, 2025
కర్నూలు: 1,78,466 పేపర్ల మూల్యాంకనం

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం మంగళవారం నాటికి 1,78,466 పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆరవ రోజు మూల్యాంకనం ముగిసే సమయానికి 93%గా నమోదయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. 114 మంది చీఫ్ ఎగ్జామినర్లు,682 మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లు, 215 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఓపెన్ ఇంటర్కు సంబంధించి మూల్యంకనం పూర్తయినట్లు వెల్లడించారు.
Similar News
News November 23, 2025
5వ బాలోత్సవం లోగో, బ్రోచర్ ఆవిష్కరణ: కలెక్టర్

మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో డిసెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న 5వ బాలోత్సవం-2025 సన్నాహకాలు వేగంగా జరుగుతున్నాయి. బాలోత్సవానికి ప్రతీకగా రూపొందించిన అధికారిక లోగోను కలెక్టర్ డా.సిరి ఆవిష్కరించారు. బాలోత్సవం పిల్లల సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలను వెలికితీయడానికి ముఖ్య వేదికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే పోటీలు, విభాగాలు, తేదీలు, నిబంధనలు, నమోదు చేయాలన్నారు.
News November 23, 2025
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలుకు పతకాలు

ఈ నెల 15, 16వ తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలు క్రీడాకారులు 2 బంగారు, ఒక రజితం, 10 కాంస్య పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం కర్నూలు శరీన్ నగర్లోని వెంకటేష్ తైక్వాండో అకాడమీలో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసులు అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలన్నారు.
News November 23, 2025
సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.


