News June 11, 2024
కర్నూలు: 19న జడ్పీ సర్వసభ్య సమావేశం

జడ్పీ సర్వసభ్య సమావేశం 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించను న్నట్లు సీఈవో జి.నాసర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల శాఖలపై సమీక్షించనున్నట్లు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.
Similar News
News December 5, 2025
1,445 పాఠశాలలో మెగా పీటీఎం 3.0 విజయవంతం: డీఈవో

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1,445 పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమం విజయవంతం అయిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. విద్యార్ధుల ప్రగతితో పాటు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు, టీచర్లను, విద్యార్థులను ఆయన కోరారు. ఎస్ఎంసీ సభ్యులు-17,974, ప్రజా ప్రతినిధులు-2,111, అధికారులు-1,751, స్థానిక ప్రతినిధులు-2,395 పాల్గొన్నట్లు తెలిపారు.
News December 5, 2025
కర్నూలులో వేసవి కోసం ముందస్తు చర్యలు: కలెక్టర్

జిల్లాలో వేసవికాలంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. చేతి పంపులు, రక్షిత నీటి పథకాలు, పైపులైన్ల లీకేజీలు తదితర మరమ్మత్తులను డిసెంబర్ 20 లోపు పూర్తి చేయాలని ఆమె స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పూర్తిగా నింపాలన్నారు. గ్రామాలలో చిన్నపాటి మరమ్మతులను చేయాలని ఆదేశించారు.
News December 4, 2025
సూర్య ఘర్పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయండి: కలెక్టర్

పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ప్రతీ ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. 2026-27 నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


