News March 23, 2024
కర్నూలు: 20 ఏళ్లుగా పనిచేసిన వ్యక్తికి టికెట్ నిరాకరణ
మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి 2014, 2019లో TDP తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కాదని ఈసారి రాఘవేంద్రరెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తిక్కారెడ్డి వర్గం నిరసనలు చేపట్టింది. మూడో జాబితాలో అయినా తననే అభ్యర్థిగా ప్రకటిస్తారేమోనని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తిక్కారెడ్డి TDPలోనే కొనసాగుతారా? లేక వేరే పార్టీలోకి వెళ్తారా అనే చర్చ నడుస్తోంది.
Similar News
News September 17, 2024
పేదింటి రైతు బిడ్డకు ఎంబీబీఎస్ సీటు
క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన దూదేకుల రంజిత్ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. తల్లిదండ్రులు రెహమాన్, మహబూబ్ బీ వ్యవసాయం చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. తన కుమారుడు రంజిత్ నీట్‌లో 582/720 మార్కులు సాధించి మొదట విడత కౌన్సెలింగ్‌లోనే సీటు సాధించాడని ఆనందం వ్యక్తం చేశారు. రంజిత్‌ను పలువురు అభినందించారు.
News September 17, 2024
ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం
ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణి పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో (శివమ్మ ఆసుపత్రి)లో చేరారు. డా.హనీషా, డా.యశ్వంత్ రెడ్డితో కూడిన వైద్యుల బృందం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు చేయగా ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
News September 17, 2024
గోనెగండ్ల వద్ద విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కర్నూలు జల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చాకలి తిక్కన్న (35) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తిక్కన్న ఇంటి సమీపంలోని మేకల షెడ్డులో విద్యుత్ వైర్లను సరి చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు తిక్కన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.