News October 2, 2024
కర్నూలు: 24 గంటల్లో మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
పత్తికొండ మండలం పుచ్చకాయలమడకు చెందిన అశోక్ అనే నిరుద్యోగి తనకు ఆటో ఇప్పించాలని నిన్న సీఎం చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. సీఎం హామీ మేరకు బుధవారం అశోక్‌కు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కలెక్టర్ రంజిత్ బాషా ఆటో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News October 4, 2024
ఆలూరు ఎమ్మెల్యే తమ్ముడు సహా 24 మందిపై కేసు
కర్నూలు జిల్లాలోని రెన్యూ విండ్ పవర్, గ్రీన్ ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులకు పాల్పడిన ఘటనలో పోలీసులు 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బసినె విరూపాక్షి తమ్ముడు, వైసీపీ నేత బసినె వెంకటేశ్‌తో పాటు మరో 23 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. వారికి సంబంధించిన వాహనాలను సీజ్ చేశారు.
News October 4, 2024
కర్నూలు: లా పరీక్ష ఫలితాల విడుదల
రాయలసీమ వర్సిటీ పరిధిలో జరిగిన (2023) లా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్‌లో 153 మంది, మూడో సెమిస్టర్‌లో 1,509 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్‌లో 32 మంది, మూడో సెమిస్టర్‌లో 37 మంది, మూడేళ్ల కోర్సు సప్లమెంటరీ మొదటి సెమిస్టర్‌లో 38 మంది, మూడో సెమిస్టర్‌లో 17 మంది ఉత్తీర్ణులయ్యారు.
News October 4, 2024
క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా ఓటరు జాబితా సర్వే: కమిషనర్
ఓటరు జాబితా సవరణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు బీఎల్ఓలను ఆదేశించారు. గురువారం నగరపాలక నూతన కౌన్సిల్ హాలులో బిఎల్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఫాం 6, 7, 8ల పూరింపులపై అవగాహన కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతకు కొత్త ఓటుకు ధరకాస్తు, చనిపోయినవారి ఓటు తొలగింపు, సవరణలు తప్పొప్పులు లేకుండా ప్రక్రియ చేయాలన్నారు.