News April 24, 2024
కర్నూలు: 3రోజులు బడికి వెళ్లి 509 మార్కులు

చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వనూరమ్మల కుమార్తె బోయ నవీన పదో తరగతిలో 509 మార్కులు సాధించింది. తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఇంటి పరిస్థితుల కారణంగా వారంలో మూడు రోజులు కూలీ పనులకు వెళ్తూ.. మూడు రోజులు బడికి వెళ్లేది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదివి 509 మార్కులు సాధించింది.
Similar News
News April 22, 2025
రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని వినతి

కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం కర్నూలు జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బృందం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసులు మాట్లాడారు. కర్నూలులో ప్రెస్ క్లబ్ లేకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. కలెక్టర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
News April 21, 2025
వాట్సప్ సేవలను ఉపయోగించుకోవాలి: కర్నూల్ కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాట్సాప్ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూల్ కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు” పోస్టర్ను జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, డిఆర్ఓ వెంకట్ నారాయణమ్మతో కలిసి ఆవిష్కరించారు. ప్రభుత్వ సేవలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తుందన్నారు.