News March 27, 2024

కర్నూలు: 3 నుంచి ఏప్రిల్ నెల పింఛన్లు

image

ఏప్రిల్ నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3 రోజులు ఆలస్యం కానుందని డీఆర్డీఏ-వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ సలీమ్ బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 31 ఆదివారం నాటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, మరుసటి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉందని, 2న పింఛన్ల బడ్జెట్‌ను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుందని చెప్పారు. 3వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పెన్షనర్లు గమనించాలని కోరారు.

Similar News

News March 18, 2025

BREAKING: కర్నూలు జిల్లాలో 11 మంది SIల బదిలీ

image

☛ బాల నరసింహులు హొళగుంద నుంచి కర్నూలు త్రీటౌన్
☛ హనుమంత రెడ్డి VR TO కోసిగి
☛ చంద్రమోహన్‌ కోసిగి TO కర్నూలు 3టౌన్‌
☛ కేశవ కొత్తపల్లి TO నందవరం
☛ శ్రీనివాసులు నందవరం TO DCRB కర్నూలు
☛ రమేశ్ బాబు VR TO కర్నూలు 1టౌన్
☛ మన్మథ విజయ్‌ కర్నూలు 3టౌన్‌ TO ఆస్పరి
☛ మల్లికార్జున DSO నుంచి జొన్నగిరి
☛ జయశేఖర్‌ జొన్నగిరి నుంచి ఆదోని 3టౌన్
☛ దిలీప్ కుమార్ ఆలూరు నుంచి హోళగుంద
☛ మహబూబ్ బాషా హోళగుంద నుంచి ఆలూరు

News March 18, 2025

కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు

image

కోడుమూరులోని కర్నూలు రహదారిలో ఉన్న మాజీ సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంగళవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహం తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల కన్వీనర్ రమేశ్ నాయుడు, కృష్ణారెడ్డి దగ్ధమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.

News March 18, 2025

పోసాని మోసం చేశాడంటూ కర్నూలు వ్యక్తి ఫిర్యాదు

image

నటుడు పోసాని కృష్ణ మురళిని కేసులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి పోసాని తనను మోసం చేశాడంటూ తాజాగా టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని రూ.9లక్షలు తీసుకుని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. తననకు న్యాయం చేయాలని కోరారు.

error: Content is protected !!