News April 24, 2024

కర్నూలు: 3 రోజులు పనికి, మరో 3 రోజులు బడికి.. టెన్త్‌లో 509 మార్కులు

image

పదో తరగతి ఫలితాల్లో చిప్పగిరి మండలం బంటనహాల్‌కు చెందిన నవీన అనే విద్యార్థిని 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా ఇవే అత్యధిక మార్కులు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక నవీన వారంలో 3 రోజులు కూలీ పనులకు, మరో 3 రోజులు పాఠశాలకు వెళ్లేదని స్థానికులు తెలిపారు. నవీన తండ్రి వ్యవసాయ కూలీ కాగా, ఆమె తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని తెలిపారు.

Similar News

News February 8, 2026

ప్రజా గ్రీవెన్స్ రద్దు: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్, రెవున్యూ క్లినిక్ రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రద్దు కారణంగా ఎవరూ అర్జీలు ఇచ్చేందుకు కలెక్టర్ కార్యాలయానికి రాకూడదని సూచించారు.

News February 8, 2026

కర్నూలులో రెసోనెన్స్.. సీమకు జాతీయ స్థాయి విద్య

image

రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో ఫిబ్రవరి 7(శనివారం) ప్రారంభమైంది. కార్యక్రమానికి టీ.జీ. వెంకటేశ్, పద్మశ్రీ బ్రహ్మానందం, ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరై రెసోనెన్స్ 25 ఏళ్ల అకడమిక్ సేవలను ప్రశంసించారు. రాయలసీమ విద్యార్థులకు స్థానికంగా నాణ్యమైన విద్య, నిపుణుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన చదువు వాతావరణం లభిస్తే JEE/NEET వంటి పోటీపరీక్షల్లో గొప్ప విజయాలు సాధిస్తారని వారు తెలిపారు.

News February 8, 2026

వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాన్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. తడి చెత్తను సాంకేతిక పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. డంపింగ్ యార్డులలో పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయించాలన్నారు.