News April 24, 2024
కర్నూలు: 594 మార్కులు సాధించిన రైతు బిడ్డ

రుద్రవరం మండలం బీరవోలుకు చెందిన రైతు పుల్లారెడ్డి, శిరీష దంపతుల కుమార్తె ఎం హర్షిత 594 మార్కులు సాధించి మండలంలో అత్యధిక మార్కులు సాధించిన బాలికగా నిలిచింది. అలాగే తాను చదివిన నంద్యాలలోని గురురాజ పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తమ కూతురు పదో తరగతి పరీక్షల్లో ఇలా మొదటి ర్యాంకు సాధించినందుకు తమకెంతో ఆనందంగా ఉందని విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News November 11, 2025
హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి: మంత్రి

హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు అంశంపై కలెక్టర్ సిరితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
News November 10, 2025
ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.
News November 10, 2025
కర్నూలు జిల్లాకు పతకాలు

ఈనెల 7 నుంచి 9 వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19, 14 విభాగాలలో రైఫిల్ షూటింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు పతకాల పంట సాధించినట్లు జిల్లా కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విజేతలుగా నిలిచిన రామ్ జిగ్నేష్, నక్షత్ర, అన్నా జెన్ క్రీడాకారులను సత్కరించారు. జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్నారు.


