News July 28, 2024
కర్నూలు: IIITDMలో విద్యార్థి సూసైడ్

కర్నూలు జగన్నాథగట్టులో ఉన్న IIITDMలో శనివారం బీటెక్ మూడో సంవత్సర విద్యార్థి సాయికార్తీక్ నాయుడు(20) ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మన్యం పార్వతీపురం జిల్లాకు చెందిన వాసి. మధ్యాహ్నం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి జేబులో సూసైడ్ నోట్ అనుమానాలకు తావిస్తోంది.
Similar News
News November 9, 2025
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరు పెట్టి వచ్చే యాడ్స్, వాట్సాప్/ ఇన్స్టాగ్రామ్/ టెలిగ్రామ్ లింక్స్‌ను నమ్మవద్దు అన్నారు. తక్కువలో ఎక్కువ లాభాలు వచ్చే వాగ్దానాలు కచ్చితంగా మోసం చేసేందుకే అన్నారు. లింక్స్ క్లిక్ చేయొద్దని, అపరిచిత APK/ఫైళ్ళు ఇన్స్టాల్ చేయవద్దని, OTP, UPI PIN వంటివి చెప్పొద్దన్నారు.
News November 8, 2025
కర్నూలు-వైజాగ్‌కు ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభం

కర్నూలు నుంచి వైజాగ్‌కు 3 నూతన ఏసీ బస్సు సర్వీసులను కర్నూలులో మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసుల వల్ల రెండు ప్రాంతాల్లో టూరిజం డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని మంత్రి అన్నారు. ఇక బస్సు ప్రమాదాలు జరగడం ఎంతో బాధాకరమని, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ బస్సులో ఉంటే ఇటీవల కర్నూలులో బస్సు ప్రమాదం జరిగేది కాదని అన్నారు. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.
News November 8, 2025
ఆదోని: ఈతకెళ్లి బాలుడి మృతి

ఆదోని పరిధిలోని బసాపురంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గౌరమ్మ పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన బిచ్చల ఈరన్న కూతురు వరమ్మ కుమారుడు కాలువలో శవంగా తేలాడు. శుక్రవారం పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగారు. ఐతే బాలుడు ఒంటరిగా ఈత ఆడుకుంటూ కాలువలో కొట్టుకుపోయాడు. శనివారం హనువాళ్లు గ్రామంలో మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


