News July 14, 2024
కర్నూలు SPగా మొదటి పోస్టింగ్.. విమర్శలు, ప్రసంశలు
కర్నూలు SP కృష్ణకాంత్ నెల్లూరుకు బదిలీ అయ్యారు. ఈయన 2023 ఏప్రిల్ 12న కర్నూలు SPగా వచ్చారు. మొదటి పోస్టింగే అయినా అంతగా ప్రభావం చూపలేదనే విమర్శలు ఉన్నా.. నిత్యం ప్రజల్లో ఉండేవారని, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేశారనే ప్రసంశలూ అందుకున్నారు. YS వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కర్నూలుకు వచ్చిన CBI అధికారులకు సహకరించలేదనే విమర్శలున్నాయి.
Similar News
News October 12, 2024
కర్నూలు జిల్లాలో కిలో టమాటా @రూ.20
కర్నూలు జిల్లాలో ఇటీవల రూ.100 పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో శనివారం కిలో టమాటా ధర రూ.20కి పడిపోయింది. కాగా ఇటీవల టమాట ధరలు పెరగడంతో ప్రభుత్వం సబ్సిడి కేంద్రాల్లో తక్కవ ధరలకే టమాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 12, 2024
కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు 5,128 దరఖాస్తులు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,128 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,013 దరఖాస్తులు రాగా, నంద్యాల జిల్లాలో 105 దుకాణాలకు 2,115 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14న కర్నూలు జడ్పీ సమావేశ హాల్‌లో లక్కీ డిప్ తీయనున్నారు.
News October 12, 2024
హొళగుంద: దేవరగట్టులో నేడు కర్రల సమరం
ఇరు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు కర్రల సమరం దసర సందర్భంగా శనివారం జరగనుంది. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం జరిగే బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానికులు తెలిపారు. బన్ని ఉత్సవాల్లో మూడు గ్రామాలు ఒక వైపు మరో ఏడు గ్రామాలు ఒకవైపు నుంచి తలపడుతాయి. కాగా కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.