News April 2, 2025

కర్నూలు: TODAY TOP NEWS

image

➤ రేపు కర్నూలుకు YS జగన్ రాక➤ కర్నూలు- విజయవాడ విమాన సర్వీసులపై చర్చించిన మంత్రి టీజీ➤ బీటీ నాయుడు ప్రమాణ స్వీకారానికి మంత్రాలయం నేతలు➤ ఎమ్మిగనూరు గాంధీ నగర్‌లో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం➤ కర్నూలు జిల్లాకు వర్ష సూచన➤ కర్నూలు: నకిలీ డాక్యుమెంట్లతో కోట్లు స్వాహా➤ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసనలు➤ నంది అవార్డు గ్రహీతకు ఆదోని DSP అభినందన ➤గోనెగండ్లలో పర్యటించిన సబ్ కలెక్టర్

Similar News

News December 6, 2025

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: జిల్లా SP.!

image

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. శనివారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారన్నారు.

News December 6, 2025

బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

image

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.

News December 6, 2025

కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త.!

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.