News June 24, 2024
కర్నూల్ కొత్త కలెక్టర్ గురించి ఈ విషయాలు తెలుసా..

కర్నూల్ జిల్లా కలెక్టర్గా నియమితులైన రంజిత్ బాషా 2018లో పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేశ్ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఆయనకు కలెక్టర్గా పదోన్నతి కల్పించింది. ఇక బాల్యంలో ఆయన విద్యాభ్యాసం జిల్లాలోనే సాగింది. నందికొట్కూరులోని సంతపేట పాఠశాల, ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని ఏపీ గురుకులం, నందికొట్కూరు ప్రభుత్వ కళాశాలల్లో 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివారు.
Similar News
News December 17, 2025
‘జిల్లాలో రబీకి యూరియా కొరత లేదు’

కర్నూలు జిల్లాలో రబీ సీజన్కు యూరియా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు మొత్తం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 8,487 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉండగా, డిసెంబర్ చివరికి మరింత యూరియా రానుందని చెప్పారు. రైతులు ఎంఆర్పీ ధరలకే ఎరువులు కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలని సూచించారు.
News December 17, 2025
ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
News December 17, 2025
ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి: జేసీ

ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అధికారులు అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


