News July 22, 2024
కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.43 ఉండగా 52 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 48 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.76 ఉండగా 33 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 30 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.97.87గా ఉంది.
Similar News
News November 26, 2025
జాతీయ స్థాయిలో కర్నూలుకు పతకాలు

ఈనెల 21 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్లోని బరేలిలో జరిగిన 8వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల(క్యాడెట్ విభాగం-అండర్ 45)లో జిల్లా క్రీడాకారులు కార్తీక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శిక్షకుడు సతీశ్ తెలిపారు. మరో క్రీడాకారిణి గాయత్రి 41వ సీనియర్ అండర్-53 విభాగంలో రన్నర్గా నిలిచారన్నారు. వారిని మంగళవారం ఘనంగా సత్కరించారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ట్రాఫిక్ నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. యువత పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.