News July 27, 2024
కర్నూల్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

కర్నూల్ ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. విజయనగరం విద్యార్థి సాయికార్తీక్ తొమ్మిదో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాయికార్తీక్ ఈసీఈ మూడో సంవత్సరం చుదువుతున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 25, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా శనివారం పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.
News October 25, 2025
పోలీసుల అదుపులో శివశంకర్ స్నేహితుడు

కర్నూలు బస్సు ప్రమాదంలో శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు శివశంకర్ బైక్ ఎక్కారు. వీరిద్దరూ పెట్రోల్ బంకులో ఉన్న <<18098159>>CC వీడియో<<>> బయటకొచ్చింది. బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ ఎగిరి పడినట్లు తెలుస్తోంది. ఘటనలో శివశంకర్ మృతిచెందగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు.
News October 25, 2025
అతనెవరు.. తెలిస్తే చెప్పండి: కలెక్టర్

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తిని గుర్తిస్తే కంట్రోల్ రూమ్ 08518 277305కు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో ఎక్కినట్లు తెలిసిందన్నారు. అతని పేరు ప్రయాణికుల జాబితాలో లేదని తెలిపారు. వయసు 50 ఏళ్లు ఉండవచ్చని, అతని వివరాలు తెలిస్తే తెలపాలని కోరారు.


