News April 29, 2024

కర్నూల్: మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

image

కర్నూల్ దేవా నగర్‌కు చెందిన వడ్డే శివ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం మృతుడికి గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డికి చెందిన నాగేశ్వరి పల్లవితో వివాహం జరిగింది. కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరగడందో నాగేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివ మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్ననట్లు చెబుతున్నారు. కర్నూల్ మూడో పట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 16, 2026

ప్రాజెక్టుల సాధన కోసం పోరాటం: ఎస్వీ మోహన్ రెడ్డి

image

కర్నూలు: రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్, గుండ్రేవుల సాగునీటి ప్రాజెక్టుల సాధన వరకు పోరాటం ఆపబోమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు సమాలోచన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గళం వినిపించారు.

News April 16, 2026

ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించండి: కలెక్టర్

image

నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ నెల 17న ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ నియోజకవర్గ స్పెషల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 2,000 మంది మహిళలతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News April 16, 2026

చిలకలడోణ ప్రమాదంపై ఎంపీ దిగ్భ్రాంతి

image

మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది కర్ణాటక వాసులు మృతి చెందడం బాధాకరమని అన్నారు.