News March 5, 2025
కర్మయోగి పోర్టల్ ద్వారా ఆన్లైన్ శిక్షణ పూర్తిచేసుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా మార్చి 16వ తేదీలోగా ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్ శిక్షణ పూర్తిచేసుకోవాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్ధ్యాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
Similar News
News March 6, 2025
VZM: మొత్తం 308 దరఖాస్తులు.. మరికాసేపట్లో ప్రారంభం!

విజయనగరం జిల్లాలో కళ్లు గీత, సొండి, శెట్టి బలిజ, శ్రీ సైన, యాత, సెగిడి సామాజిక వర్గాలకు 16 మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. దీని కోసం ఆయా సామాజిక వర్గాల నుంచి మొత్తం 308 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది.గత నెల 10న లాటరీ తీయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచింది. అదృష్టవంతులెవరో మరికాసేపట్లో తేలిపోనుంది.
News March 6, 2025
అవసరమైతే పోలీసులను వినియోగించుకుంటాం: కలెక్టర్

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణాలపై ముద్రించిన పోస్టర్లను తన ఛాంబర్లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల కార్మికులను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే దీనికోసం పోలీసులను కూడా వినియోగించుకుంటామన్నారు.
News March 6, 2025
VZM: మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత

అప్పటి సతివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత పొట్నూరు సూర్యనారాయణ సతీమణి కనకమ్మ బుధవారం కన్నుముశారు. ఆమె గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పాలవలస సర్పంచ్గా కొనసాగుతున్నారు. ప్రజల సందర్శనార్థం పార్ధివదేహాన్ని పాలవలసలోని తన నివాసంలో అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.