News February 8, 2025
కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 18, 2025
SRCL: ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.
News November 18, 2025
పుట్టపర్తికి సచిన్ టెండూల్కర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ పుట్టపర్తికి చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్ను మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతసేపు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
News November 18, 2025
శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్లో కుప్ప కూలిన అధ్యాపకుడు

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.


