News February 8, 2025
కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News March 27, 2025
కన్నడిగులకు మరో షాక్!

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాల ధరలను లీటరుకు రూ.4 పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ ధరలను లీటరుకు రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కోరగా సీఎం సిద్దరామయ్య రూ.4 పెంచేందుకు అంగీకరించారు. ఇటీవలే అక్కడ కరెంట్ ఛార్జీలను పెంచారు. 6 గ్యారంటీలే ధరల పెరుగుదలకు కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.
News March 27, 2025
గూడూరులో డెడ్ బాడీ కలకలం

గూడూరు పట్టణ శివారులోని టిడ్కో ఇళ్ల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఇవాళ కలకలం రేపింది. టిడ్కో గృహాల పక్కనే ఉన్న కంపచెట్ల పొదల్లో ఓ మృతదేహం కుళ్లిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారం రోజుల క్రితం ఓ మహిళ తన కుమారుడు సోహెల్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నారు. పోలీసులు సోహెల్ మృతదేహంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 27, 2025
KNR: వారధి సొసైటీ ద్వారా 2,997 మందికి ప్రత్యక్ష ఉపాధి: కలెక్టర్

వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వారధి సొసైటీ 2015 లో ప్రారంభమైందని అన్నారు. 2 వేల 997 మంది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ ఏడాది 186 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.