News September 24, 2024
కర్రోతు బంగార్రాజుకు కీలక పదవి

నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రోతు బంగార్రాజుకు కీలక పదవి వరించింది. ఏపీ మార్క్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కర్రోతును నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి జాబితాలో 20 మంది ఆశావహులకు నామినేటెడ్ పదవులు వరించగా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క బంగార్రాజుకే అవకాశం దక్కింది. పదవులు కోసం ఎదురు చూస్తున్న పలువురికి తొలి జాబితాలో నిరాశ ఎదురైంది.
Similar News
News November 18, 2025
మెరకముడిదాం : ఉపాధ్యాయుడుని సత్కరించిన విజయనగరం ఎంపి

మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సత్కరించారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను పదవతరగతి విద్యార్థులను విమానం ఎక్కించినందుకు సత్యారావుని ఎంపి అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను విమానం ఎక్కిస్తానని సత్యారావు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.