News September 24, 2024

కర్రోతు బంగార్రాజును అభినందించిన ఎంపీ

image

AP మార్క్ ఫెడ్ ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన నెల్లిమర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కుర్రోతు బంగార్రాజును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులలో సామాన్య కార్యకర్తలకు, యువతకు పెద్ద పీట కూటమి ప్రభుత్వం వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్‌ఎస్‌లో వివరాల అప్‌లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్‌బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.

News January 8, 2026

వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.