News September 24, 2024
కర్రోతు బంగార్రాజును అభినందించిన ఎంపీ
AP మార్క్ ఫెడ్ ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన నెల్లిమర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ కుర్రోతు బంగార్రాజును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులలో సామాన్య కార్యకర్తలకు, యువతకు పెద్ద పీట కూటమి ప్రభుత్వం వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2024
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
News October 6, 2024
దళారుల బారిన పడి మోసపోవద్దు: VZM కలెక్టర్
కేజీబీవీలో ఉద్యోగాలకు కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, దళారులబారిన పడి అభ్యర్థులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు వసూలు చేస్తున్న వారి వివరాలు తమకి తెలియజేయాలని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
News October 6, 2024
విజయనగరం జిల్లా టెట్ అభ్యర్థులకు కీలక UPDATE
విజయనగరం జిల్లాలోని టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్, నామినల్ రోల్‌లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు. ఇందుకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ఇంటిపేరు, బర్త్ డే మార్పుల కోసం టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏదైనా గుర్తింపు కార్డును ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులకు అందజేయాలని డీఈవో పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.