News October 14, 2024

కర్లపాలెంలో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి

image

చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్లపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక శనివారం సాయంత్రం ఇంటి సమీపంలో కుళాయి వద్ద నీరు పడుతోంది. ఈ క్రమంలో 50ఏళ్ల వయసున్న భాగ్యారావు బాలికకు మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 3, 2024

‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్య పోయావా చంద్రబాబు’

image

‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా!.. అమరావతిలో ఇలా కట్టలేదని సిగ్గుపడ్డావా?’.. అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ఈ మేరకు Xలో ఆయన ఓ పోస్ట్ చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను పరిశీలించిన విషయం తెలిసిందే. కాగా అంబటి ట్వీట్‌తో కూటమి నేతలు మండిపడుతున్నారు. 

News November 3, 2024

అమరావతికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి: సీపీఎం

image

రాజధాని అమరావతికి అప్పు కాదు.. కేంద్ర ప్రభుత్వం రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబురావు అన్నారు. శనివారం అమరావతి తుళ్లూరులో సీఆర్డీఏ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబురావు మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చిత పరిస్థితి మళ్లీ తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా, పటిష్ఠంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

News November 3, 2024

హంతకులకు కొమ్ము కాస్తున్నారు : అంబటి

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బాలిక శైలజ మృతి బాధాకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాలిక హత్య జరిగి నాలుగు నెలలు దాటిన ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్ బాలిక కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నా.. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి హంతకులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.