News February 24, 2025
కర్లపాలెం: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం సమీపంలో కొత్త నందాయపాలెంకి చెందిన రైతు సుబ్బారెడ్డి మిర్చి పొలంలో నీరు పెట్టేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో బోరు స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 7, 2026
HYDలో IPS అధికారుల బదిలీలు.. పోస్టింగ్‌ల వివరాలు!

సౌత్ రేంజ్ అడిషనల్ కమిషనర్(L&O)గా తప్సీర్ ఇక్బల్, నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్‌గా ఎన్.శ్వేత, హైదరాబాద్ SP BR జాయింట్ కమిషనర్‌గా విజయ్ కుమార్ నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. సికింద్రాబాద్ DCPగా రక్షితామూర్తి, చార్మినార్ జోన్ DCP-కిరణ్ ప్రభాకర్, ఖైరతాబాద్ DCP-శిల్పవల్లి, గోల్కొండ DCP-G.చంద్రమోహన్, జూబ్లీహిల్స్ DCP-రమణా రెడ్డి, శంషాబాద్ DCP-రాజేశ్ బదిలీ అయ్యారు.
News January 7, 2026
కామారెడ్డి: కస్తూర్బా విద్యాలయ స్పెషల్ ఆఫీసర్లకు శిక్షణ

కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయల స్పెషల్ ఆఫీసర్లకు, మోడల్ స్కూల్ హాస్టల్ కేర్ టేకర్లకు ఐదు రోజుల శిక్షణలో భాగంగా బుధవారం కామారెడ్డిలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ప్రారంభించారు. KGVP విద్యాలయాల్లో చదువుతున్న బాలికల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, హాస్టల్స్ నిర్వహణ గురించి శిక్షణలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు సుకన్య, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
News January 7, 2026
సూర్యాపేట: డీఎస్పీ నరసింహాచారికి పోలీస్ సేవా పతకం

సూర్యాపేట జిల్లా పోలీస్ సాయుధ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ నరసింహాచారిని రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం వరించింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఈరోజు ఎస్పీ నరసింహను డీఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు డీఎస్పీని ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు చెప్పారు.


