News February 24, 2025
కర్లపాలెం: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం సమీపంలో కొత్త నందాయపాలెంకి చెందిన రైతు సుబ్బారెడ్డి మిర్చి పొలంలో నీరు పెట్టేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో బోరు స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 25, 2025
గంజాయి కేసులో పదేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

గంజాయి కేసులో ముద్దాయిలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టు తీర్పును ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2021 మే 20వ తేదీన అనకాపల్లి టౌన్ పరిధిలో 20 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు సోమవారం శిక్షను విధించిందని ఎస్పీ తెలిపారు.
News February 25, 2025
ALP: మహాశివరాత్రికి లడ్డూ ప్రసాదం రెడీ

అలంపూర్ లో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవి ఆలయాల్లో ఈనెల 26న జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి. స్వామి అమ్మవారి మహా ప్రసాదంగా భావించే లడ్డు ల కొరత రాకుండా భక్తుల సౌకర్యార్థం 20 వేల లడ్డులు తయారు చేయించినట్లు ఈవో పురందర్ కుమార్ సోమవారం తెలిపారు. శివరాత్రి వేడుకలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.
News February 25, 2025
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై కేసులు: విశాఖ జేసీ

గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌లు MRP కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం గ్యాస్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని విశాఖ జేసీ మయూర్ అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లతో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. దీపం-2 పథకం కింద సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ జమ కావాలన్నారు. కాని పక్షంలో డీలర్లను సంప్రదించారని లబ్ధిదారులను కోరారు.