News February 7, 2025
కర్లపాలెం PSను తనిఖీ చేసిన ఎస్పీ

కర్లపాలెం పోలీస్ స్టేషన్ను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్మెట్ అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News November 4, 2025
MDK: లోన్ యాప్లకు యువకుడి ఆత్మహత్య

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 9వ వార్డులో నివాసముండే సామల శ్రీశైలం రెండు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. లోన్ యాప్ల వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
ములుగు జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు

జిల్లాలో 184 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర్ టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల్లో 1,318 టార్పాలిన్ కవర్లు, 56 తూర్పార యంత్రాలు, 87 తూకం యంత్రాలతో పాటు 1,28,750 గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని వివరించారు. ఇప్పటివరకు ఆరుగురు రైతుల నుంచి ₹6,83,254 విలువ గల 28.600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 4, 2025
TU: సత్ఫలితాలనిస్తున్న బయోమెట్రిక్ హాజరు

తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది. బయోమెట్రిక్ హాజరు లేని సిబ్బంది సాధారణ సెలవులను భారీగా కోత విధించింది.


