News January 8, 2025

కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పెడన కలంకారీ ఆర్టిజాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్‌ను కలిసి పెడనలో ఏర్పాటు చేయనున్న కలంకారీ క్లస్టర్ గురించి చర్చించారు. 

Similar News

News January 10, 2025

పోరంకిలో మహిళ హత్య  UPDATE

image

పోరంకిలో రాణి హత్యకు గురైన ఘటనకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. రాణి కూతురు భర్త నరేశ్‌తో విభేదాల కారణంగా తన కూతురిలో తల్లి వద్దే ఉంటోంది. అయితే వారి కూతురి బడికి పంపకుండా మాల్‌లో పనికి పంపేవారు. ఈ విషయంపై అల్లుడు గురువారం అత్త ఇంటికొచ్చి తన కూతురిని చదివించకుండా పనికి పంపుతున్నారంటూ హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామన్నారు. 

News January 10, 2025

ఆ సమాచారం తెలిస్తే ఈ నెంబరుకు ఫోన్ చేయండి: సీపీ

image

గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, వ్యక్తులు, వాహనాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ రాజశేఖరబాబు సూచించారు. ఆ సమాచారం ఇచ్చేందుకు 1972 లేదా 112 నెంబరుకు కాల్ చేయాలని ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీపీ రాజశేఖరబాబు ఈ మేరకు యువతకు సూచించారు.

News January 10, 2025

పెనమలూరులో అత్తను చంపిన అల్లుడు

image

పెనమలూరు మండలంలోని పోరంకిలో గురువారం రాత్రి దారుణం జరిగింది. అత్తను అల్లుడు బండరాయితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో పోరంకికి చెందిన ఉమ్మడి రాణి(65)ని ఆమె అల్లుడు నారబోయిన నరేశ్ రాయితో కొట్టడంతో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉయ్యూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.