News March 2, 2025

కలగానే జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం!

image

నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ ఎయిర్ పోర్టుకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించి ఎయిర్ పోర్టు స్థలాన్ని పరిశీలించిన తెలిసిందే.

Similar News

News March 23, 2025

నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. వేసవి కాలం అయినా.. శనివారం కోటగిరిలో అత్యధికంగా 38.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. కమ్మర్పల్లి 38.3, ఏర్గట్ల, నందిపేట 38.1, నిజామాబాద్ సౌత్, వైల్పూర్ 38, మక్లూర్ 37.9, మోర్తాడ్, ముప్కల్ 37.6, జక్రాన్‌పల్లె, టోండకుర్, ఏడపల్లి 37.4, చిన్నమావంది 37.2, సాలూర 36.9, చిమన్‌పల్లె, మదన్‌పల్లె 36.8, ఇస్సాపల్లి 36.4, లక్మాపూర్ 36.1, కోరాట్పల్లిలో 36℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 23, 2025

NZB: చెల్లి మృతి.. బాధలోనూ పరీక్ష రాసిన అన్న

image

ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్‌‌లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!

News March 23, 2025

NZB: ఆరుగురు మృతి.. 17 మందిపై కేసులు

image

నిజామాబాద్ జిల్లాలో శనివారం తీవ్ర విషాదం నింపింది. ఒక్కరోజే వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, అలాగే పలు ఘటనల్లో 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లి, వాహనం ఢీకొని, గొడవ పడటవంతో హత్య, జ్వరంతో యువకుడు, చెట్టు పైనుంచి పడి, నిజాంసాగర్ కాలువ వద్ద ఒకరు మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలాగే జూదం, న్యూసెన్స్ ఘటనల్లో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

error: Content is protected !!