News March 2, 2025

కలగానే జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం!

image

నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ ఎయిర్ పోర్టుకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించి ఎయిర్ పోర్టు స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.

Similar News

News March 17, 2025

అనారోగ్యంతో సీనియర్ నటి కన్నుమూత

image

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూశారు. చెన్నైలో నిన్న తుదిశ్వాస విడువగా ఇవాళ అంత్యక్రియలు జరిగాయి. 1982లో తమిళ సినిమా ‘కోళీ కూవుతు’తో కెరీర్ మొదలెట్టి తెలుగులో ‘దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, ప్రాణానికి ప్రాణం’ తదితర సినిమాల్లో నటించారు. 300 పైగా సినిమాల్లో నటించిన ఆమె అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూవచ్చారు. <<15773373>>ఆమె<<>> భారీగా బరువు తగ్గడంపైనా గతవారం కథనాలు వచ్చాయి.

News March 17, 2025

సిRAW: నా బూతే నా భవిష్యత్తు

image

ఒకప్పుడు హాస్యం వినసొంపుగా మనసుకి ఆహ్లాదం కలిగించేది. క్రమంగా ద్వంద్వ అర్థాలతో నవ్వించడం మొదలుపెట్టి ఇప్పుడు బూతే నవ్విస్తోంది, నడిపిస్తోంది. కొన్ని టీవీ షోలు, సినిమాలు వెగటు కామెడీతో వెళ్లదీస్తుంటే రాజకీయ నేతల నోటా ఈ రోతలే వినిపిస్తున్నాయి. ‘న భూతో న భవిష్యతి’ కాస్తా ‘నా బూతే నా భవిష్యత్తు’ అనేలా మారింది. పిల్లల్ని ఈ వికృత సంస్కృతికి దూరంగా పెంచకపోతే రేపు బూతే సుభాషితం కావొచ్చు.

News March 17, 2025

యాదాద్రి: మట్టిలో మాణిక్యం ఆ యువకుడు..!

image

అది జాన పదమైనా.. సినిమా పాటైనా.. ఆ పేదింటి బిడ్డ పాడితే వినేవారు పరవశించి పోతారు.. యాదాద్రి(D), ఆత్మకూరు.m(M), కొరిటకల్‌కు చెందిన చింత గణేశ్, గాయత్రి దంపతుల కుమారుడు చింత వెంకటేశ్ ప్రస్తుతం డిగ్రీ చదువుతూ గాయకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల ఒకే వేదికపై ఏకధాటిగా 16 గంటలపాటు 10 భాషల్లో నిర్విరామంగా పాటలు పాడి శభాష్ అనిపించుకున్నాడు. వండర్, జీనియస్, రాయల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకున్నాడు.

error: Content is protected !!