News January 28, 2025

కలికిరి: స్టేట్ లెవెల్ రిపబ్లిక్ డే పెరేడ్‌లో JNTU విద్యార్థుల ప్రదర్శన

image

స్థానిక కలికిరి JNTU విద్యార్థులు నిన్న విజయవాడలో జరిగిన స్టేట్ లెవెల్ రిపబ్లిక్ డే పెరేడ్ (SLRDC-2025)లో ప్రదర్శన కనబరచినట్లు ప్రిన్సిపల్, M. వెంకటేశ్వరరావు తెలిపారు. శరత్ కుమార్(EEE), ఢిల్లీ ప్రసాద్ (EEE), క్రిష్ణ (EEE), హరి (ECE), గురు హర్షిత్(ME) పాల్గొన్నారన్నారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసినట్లు NSS కోఆర్డినేటర్ డా. K. అపర్ణ తెలిపారు.

Similar News

News February 18, 2025

MBNR: నలుగురు తహశీల్దార్లను బదిలీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో పనిచేస్తున్న నలుగురు తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బదిలీ చేశారు. జడ్చర్ల తహశీల్దారు బ్రహ్మం గౌడ్ ను సెక్రటేరియట్ కు బదిలీ చేయగా ఆయన స్థానంలో కలెక్టరేట్లోని ఈ సెక్షన్ తహశీల్దారు నర్సింగ్రావును నియమించారు. కలెక్టరేట్ ఈ సెక్షన్ తహశీల్దార్‌గా అడ్డాకుల తహశీల్దారు మదన్మోహన్‌ను నియమించగా, సెక్రటేరియట్ నుంచి శేఖర్ అడ్డాకుల తహశీల్దారుగా నియమితులయ్యారు. వీరు బాధ్యతలు స్వీకరించారు.

News February 18, 2025

విజయవాడ: నేడు సబ్ జైలు వద్దకు రానున్న జగన్

image

విజయవాడకు నేడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో సబ్ జైల్లో ములాకత్ అవనన్నారు. ఉదయం 9:30 గంటలకు సబ్ జైల్లో వంశీని జగన్ పరామర్శించనున్నారు. జగన్ గాంధీనగర్‌లోని సబ్ జైల్ వద్దకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలువురు వైసీపీ నేతలు సబ్ జైలు వద్దకు రానున్నారు.

News February 18, 2025

HYD: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. HYDలో వివిధ సంఘాలు సమావేశం అయ్యాయి. ఛత్రపతి సేవలు నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ప్రతీ హిందువు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు. హిందువుల మనోభావాలకు అనుకూలంగా ఆయన జయంతి (ఫిబ్రవరి 19)కి సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

error: Content is protected !!