News February 2, 2025

కలిగోటలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన డిచ్పల్లి పెద్ద గంగారం (48) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైతు సాగుతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పెద్ద గంగారాం శనివారం రాత్రి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

యాభై ఏళ్ల ప్రస్థానం.. ముగిసినట్లేనా?

image

ADB, KNR జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి తగ్గింది. అగ్రనేత దేవ్ జీ లొంగుబాటు వార్తలతో KNR జిల్లాలో ముప్పాల లక్ష్మణరావుతోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడే మిగిలినట్లు తెలుస్తోంది. 2000 నుంచి 2026, ఫిబ్రవరి 21 వరకు మావోయిస్టుల పోరులో మొత్తం 12,170 మంది మృతి చెందారు. వీరిలో 5,057 మంది మావోయిస్టులు, 2,007 మంది భద్రతా సిబ్బంది, 4,138 మంది పౌరులున్నారు. మూడేళ్లలో 793 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.

News February 24, 2026

మదనపల్లె: 10KG టమాటా బాక్స్ రూ.100

image

మదనపల్లెలో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం మార్కెట్‌కు 66వేల కిలోల (66 మెట్రిక్ టన్నుల) టమాటాలను రైతులు తీసుకువచ్చారు. మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.140, రెండవ రకంరూ.110, మూడవ రకం రూ.100లతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అన్ సీజన్ కారణంగానే టమాటాలకు రేట్లు పెరగడంలేదని, రైతులకు దిగుబడి పెరిగిన గిట్టుబాటు ధరలు పలకడంలేదని వాపోయారు.

News February 24, 2026

సంగారెడ్డి: మార్చి 2 నుంచి ప్రత్యేక పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక పరీక్షలు-3 నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. మార్చి 2న తెలుగు, 4న హిందీ, 5న ఇంగ్లిష్, 6న గణితం, 7న ఫిజికల్ సైన్స్, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.