News March 20, 2025
కలిదిండి: గేట్‌లో 9వ ర్యాంకు సాధించిన సాయిచరణ్

కలిదిండి(M) ఆరుతెగలపాడు గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్ ఆల్ ఇండియా గేట్ ప్రవేశ పరీక్షలో 9వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. గతేడాది కాకినాడ JNTUలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాయిచరణ్.. గేట్ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే 9వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని సాయిచరణ్ తెలిపారు. ఐఐటీ చదవాలన్న తన ఆశయానికి తండ్రి కిశోర్, తల్లి పల్లవి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారన్నారు.
Similar News
News December 2, 2025
ఏలూరు: నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశారు.!

ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పాతాళ నాగరాజుకు, కొండ్రు ఇస్సాకు అనే వ్యక్తికి పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్సాకు అతని కుటుంబానికి చెందిన మరో వ్యక్తి సాయంతో నాగరాజుపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News December 2, 2025
లొంగుబాటు ప్రయత్నంలో మావోయిస్టు నేత బార్సే దేవా?

మావోయిస్టు అగ్రనేత, సీసీ కమిటీ సభ్యుడు మడవి హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్థానంలో బార్సే దేవా బెటాలియన్ నంబర్-1 కమాండర్‌గా ఉన్నాడు. హిడ్మా మృతి తర్వాత అతడి స్థానాన్ని దేవా భర్తీ చేశాడనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ప్రస్తుతం దేవా సైతం లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. దేవాతో కేవలం 20 మంది క్యాడర్లు మాత్రమే ఉండగా, పార్టీ మనుగడ కొనసాగడం కష్టతరంగా మారినట్లు సమాచారం.
News December 2, 2025
కృష్ణా: అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ మృతి

పమిడిముక్కల మండలం రెడ్డిపాలెం రామాలయం చెరువు వద్ద మంటాడ నుంచి వీరంకిలాకు వెళుతున్న ఆటో అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని చెరువులో పడిపోయింది. డ్రైవర్ దేశి నాగరాజు (50) స్పాట్‌లోనే మృతి చెందాడు. మహిళా ప్రయాణికులను స్థానికులు రక్షించి ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు.


