News January 18, 2025
కలిదిండి: మాజీ సర్పంచ్‌ది ప్రమాదం కాదు.. హత్య

కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్యది ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బోధన శీను పథకం ప్రకారం గురువారం సాయంత్రం దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News April 17, 2026
క్రీడాకారులకు ‘శాప్’ అండగా ఉంటుంది: భరణి

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్. భరణితో కృష్ణా జిల్లా టైక్వాండో అసోసియేషన్ కోశాధికారి అశ్విని గోగులమూడి, సభ్యురాలు సరితా దేవి శుక్రవారం భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన పారా జాతీయ టైక్వాండో పోటీలలో రాష్ట్ర క్రీడాకారులు ప్రశాంత్, షణ్ముఖ్ సాధించిన విజయాలను వారు ఎండీకి వివరించారు. క్రీడాకారుల ప్రతిభను అభినందించిన భరణి, వారికి శాప్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News April 17, 2026
పునాదికే రూ. 50 లక్షలు స్వాహా.. బందరు MP షాక్!

మచిలీపట్నం బలరాముని పేటలో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం వివాదస్పదమైంది. MP బాలశౌరి మంజూరు చేసిన రూ. 50 లక్షల నిధులను నిర్వాహకులు కేవలం పునాది (ఫౌండేషన్) కోసమే ఖర్చు చేయడంతో ఆయన విస్మయానికి గురయ్యారు. దీనిపై నివేదిక కోరినా స్పందన లేకపోవడంతో MP తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వైరం పెరుగుతుందనే ఆందోళనతో లోలోన మదనపడుతూ మౌనం వహిస్తున్నట్లు సమాచారం.