News March 8, 2025
కలిసికట్టుగా పని చేద్దాం.. ప్రగతిని సాధిద్దాం: జిల్లా ఎస్పీ

అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రగతిని సాధిద్దామని శుక్రవారం జిల్లా ఎస్పీ వి. రత్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డీపీఓ మహిళా సిబ్బందితో మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా.. కేక్ కట్ చేసి ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మానవత్వం అనేది అన్ని రంగాల్లో ఉండాలని తల్లిదండ్రులు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు.
Similar News
News November 24, 2025
26న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
News November 24, 2025
అది మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ లోపాల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
News November 24, 2025
ముగిసిన ఐబొమ్మ రవి విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసు విచారణ ముగిసింది. స్నేహితుడు నిఖిల్‌తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్, సర్వర్ యాక్సెస్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు, USDT చెల్లింపులు, APK లింక్స్‌తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.


