News November 19, 2024
కలెక్టరేట్లో ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం BC కమీషన్ ప్రతినిధుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.4 గంటల వరకు సమావేశ మందిరంలో జిల్లాలకు చెందిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను తెలపాలని అన్నారు. అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు, అభ్యర్థనలను నేరుగా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
మూడో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల స్వీకరణ

ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 7 మండలాల్లోని 191 గ్రామ పంచాయితీలకు గాను మొత్తం 1025 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు S-109, కల్లూరు S-124, పెనుబల్లి S-158, సత్తుపల్లి S-106, సింగరేణి S-157, తల్లాడ S-145, వేంసూరు 126 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. కాగా నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది.
News December 6, 2025
పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి

కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్య(65)అనే మత్స్యకారుడు మృతి చెందాడు. తండావాసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వాల్యకు చేపల వలలు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి పోయాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
News December 6, 2025
ఖమ్మం: ఎన్నికలు.. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. 192 గ్రామ పంచాయతీలకు, 1740 వార్డులకు గాను 1582 బృందాలు సిద్ధమయ్యాయి. నిబంధనల ప్రకారం 20% సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు.


