News August 31, 2024
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్ ప్రావీణ్య
భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తక్షణ స్పందన నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం తెలిపారు. భారీ వర్షాలకు సంబంధించి బాధితులు కంట్రోల్ రూమ్‌లోని టోల్ ఫ్రీ నెంబర్ 18004251115ను సంప్రదించవచ్చని తెలిపారు. బాధితులకు అండగా ఉండేందుకు కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 26, 2024
ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు
గుమ్మడూరు మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కృతజ్ఞత పూర్వకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డి.రాజేష్ మాట్లాడుతూ.. ప్రజల కొన్నేళ్ల తపస్సు త్యాగం, సామర్థ్యాల ఫలితమే రాజ్యంగమని, ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
News November 26, 2024
వరంగల్: భారీగా తగ్గిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పత్తి భారీగా తరలి వచ్చింది. అయితే ధర మాత్రం నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,860 పలకగా.. నేడు రూ.6770కి పడిపోయింది. ధరలు భారీగా పడిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.
News November 26, 2024
దుగ్గొండి: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
దుగ్గొండి మండలంలో గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. దేశాయిపల్లి గ్రామానికి చెందిన కాపరి కోట మల్లయ్య అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయ భూమి వద్ద గొర్రెల మంద పెట్టాడు. సోమవారం రాత్రి అక్కడ ఉన్న తన కుమారుడికి ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మల్లయ్య మృతి చెందినట్లు చెప్పారు.