News April 14, 2025

కలెక్టరేట్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు: కలెక్టర్

image

భారత రాజ్యంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందన్నారు. అనంతరం సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

Similar News

News October 31, 2025

DRDOలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో 5 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. MS, MSc, ME, M.TECH, పీహెచ్‌డీ, బీఈ, బీటెక్, నెట్, గేట్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News October 31, 2025

SRCL: దేవుడా.. ఈ తల్లికొచ్చిన కష్టం పగోడికీ రావద్దు..!

image

చెట్టంత కొడుకు కళ్లముందే ఆత్మహత్యకు పాల్పడ్డా.. కిరాయి ఇంట్లోకి బిడ్డ శవాన్ని తీసుకెళ్లే పరిస్థితుల్లేకున్నా ఆ తల్లి(శారద) కలతచెందలేదు. మనోధైర్యంతో మార్చురీగది నుంచే కుమారుడి అంతిమయాత్ర తీసింది. భర్త లేకపోవడంతో తానే కొడుకు చితికి నిప్పుపెట్టింది. ఈ హృదయవిదారక సంఘటన సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో జరిగింది. కాగా, మృతుడు గౌడ విశాల్(25) అనారోగ్య సమస్యలతో సోమవారం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News October 31, 2025

NTR: 586 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం

image

తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 586.5 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని జిల్లా ఉద్యాన అధికారి పి. బాలాజీ కుమార్ తెలిపారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నం, జి కొండూరు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో 399 మంది రైతులకు దాదాపు రూ. 5.50కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు.