News March 16, 2026
కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల అభినందనలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్థాపించి, విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పిస్తున్న కలెక్టర్ మహేష్ కుమార్‌ను ఉద్యోగ సంఘాలు సోమవారం ఘనంగా సన్మానించాయి. అమరావతి జేఏసీ ఛైర్మన్ వి.ఎస్ దివాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆయనకు బొకేలు అందజేశారు. కలెక్టర్ కృషికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సాయిబాబు, గణేశ్ పాల్గొన్నారు.
Similar News
News April 13, 2026
అది భర్త రక్త మాంసాలను లాక్కోవడమే.. మహిళపై హైకోర్టు ఫైర్

నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్న ఓ మహిళ భర్త నుంచి భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై MP హైకోర్టు మండిపడింది. ఇది భర్త రక్తమాంసాలను లాక్కునే ప్రయత్నమేనంది. మధ్యంతర భరణం నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. ఈ ఉదంతాన్ని షేక్స్‌పియర్ రచించిన ది మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంతో పోల్చింది. అందులో ఓ వ్యక్తి అప్పు తీర్చనందుకు అతని శరీరం నుంచి పౌండు మాంసాన్ని వ్యాపారి డిమాండ్ చేస్తారు.
News April 13, 2026
బేబీ మసాజ్‌కు ఈ ఆయిల్స్ ఉపయోగిస్తే మంచిది

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.
News April 13, 2026
మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు

మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి పుష్కరణి వద్ద చక్రత్ ఆళ్వార్‌తో కలిపి పంచామృతాలతో స్నపన తిరుమంజసం తదుపరి చక్రస్నానం మహోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పుష్పయాగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


