News March 21, 2025
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో 26 జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, MGNREGS ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, పల్లె పండుగలో భాగంగా మొదలుపెట్టిన అభివృద్ధి పనుల స్థితిగతులపై, రేపు మొదలు పెట్టబోయే ఫాం పాండ్స్ పనులపై ఆరా తీశారు. ఈ కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News March 23, 2025
ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు మారుతోంది. ఈ గాల్లో ఎగిరే టాక్సీలను తయారు చేస్తున్న సంస్థ పేరు మ్యాగ్నమ్ వింగ్స్. గుంటూరు నల్ల చెరువులో చావా అభిరాం అనే వ్యక్తి ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నాడు. ట్రాఫిక్తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నారు. తక్కువ ఖర్చుతో ఈ ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.
News March 23, 2025
పెదకాకాని: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News March 23, 2025
వ్యభిచార గృహంపై దాడి.. తెనాలి నిర్వాహకురాలి అరెస్ట్

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.